News August 24, 2024

సత్యసాయి జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

సత్యసాయి జిల్లా అగలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులను <<13916620>>సస్పెండ్<<>> చేస్తూ జిల్లా ఎస్పీ వి.రత్న ఉత్తర్వులు జారీ చేశారు. జప్తు చేసిన ద్విచక్ర వాహనాన్ని ఓ మెకానిక్ షాప్ షెడ్డు వద్దకు తీసుకెళ్లి విడిభాగాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ మీడియా వైరల్ అయిన విషయం విదితమే. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ ప్రాథమిక విచారణ జరిపించి కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.

Similar News

News December 25, 2025

శిల్పారామంలో జనవరి 1న సాంస్కృతిక కార్యక్రమాలు

image

అనంతపురం శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా 2026 జనవరి 1న సాయంత్రం 5గంటల నుంచి 8 వరకు ప్రముఖ కళాకారులచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి గురువారం వివరాలు వెల్లడించారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. అనంత ప్రజల కోసం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.

News December 25, 2025

తాడిపత్రి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

తాడిపత్రి మండలంలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చల్లవారిపల్లె సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.

News December 25, 2025

అనంత జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి ఈయనే.!

image

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బొమ్మనహల్ దర్గా హోన్నూరు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు హెచ్.ఆనంద్‌ను జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నియమించారు. తాను పార్టీకి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని తెలిపారు. ఈ పదవిని ఇచ్చిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు.