News August 24, 2024
సత్యసాయి జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
సత్యసాయి జిల్లా అగలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులను <<13916620>>సస్పెండ్<<>> చేస్తూ జిల్లా ఎస్పీ వి.రత్న ఉత్తర్వులు జారీ చేశారు. జప్తు చేసిన ద్విచక్ర వాహనాన్ని ఓ మెకానిక్ షాప్ షెడ్డు వద్దకు తీసుకెళ్లి విడిభాగాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ మీడియా వైరల్ అయిన విషయం విదితమే. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ ప్రాథమిక విచారణ జరిపించి కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
Similar News
News September 11, 2024
అనంత: రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు
రానున్న 5 రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయశంకర్ బాబు, నారాయణ స్వామి తెలిపారు. వచ్చే 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 33.9 నుంచి 35.2 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 23.5 నుంచి 24.0 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉదయం పూట గాలిలో తేమ 76 శాతం, మధ్యాహ్నం పూట 45 శాతం నమోదవుతుందన్నారు.
News September 11, 2024
అనంత: విద్యార్థి హత్య కేసు ఛేదించిన పోలీసులు
ఆత్మకూరు మండలానికి చెందిన విద్యార్థి సరిత హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇటుకలపల్లి సీఐ హేమంత్ కుమార్ తెలిపారు. మంగళవారం గుమ్మగట్ట మండలం వెంకటంపల్లికి చెందిన తిప్పేస్వామిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, వేటకొడవలి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రేమించాలని యువతిని ఫోన్లో వేధించేవాడని, ఆమె అంగీకరించకపోవడంతో వెంటపడి హత్య చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు.
News September 11, 2024
వైద్య సేవలపై రోగులకు ఆరా తీసిన కలెక్టర్
అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సిటీ స్కాన్, రక్త నిధి కేంద్రం, ఐసీయూ తదితర విభాగాలను ఆయన కలియ తిరుగుతూ సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని సమస్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు బాగా అందిస్తున్నారని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.