News March 11, 2025
సత్యసాయి జిల్లాలో 543 మంది గైర్హాజరు

జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులలో 12,320 మంది విద్యార్థులకు గానూ 11,877మంది హాజరైనట్లు డీఐఈఓ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులలో 1,642మందికి గానూ 1,542 మంది హాజరయ్యారన్నారు. 543 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు.
Similar News
News November 19, 2025
బాలల కోసం సినిమాల ప్రత్యేక ప్రదర్శనలు: ASF కలెక్టర్

జిల్లాలో బాలల కోసం సినిమా థియేటర్లలో పిల్లల చిత్రాల ప్రత్యేక ప్రదర్శన చేయనున్నట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జిల్లాలోని సినిమా థియేటర్లలో పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక చిత్ర ప్రదర్శనలు ఉంటాయన్నారు. విద్యార్థికి గ్రామీణ ప్రాంతాలలో రూ.25, పట్టణ ప్రాంతాలలో రూ.30గా టికెట్ ధర నిర్ణయించామని వెల్లడించారు.
News November 19, 2025
ఇన్ఛార్జుల పాలనలో ‘అప్పన్న’ సేవలు.. ఇంకెన్నాళ్లు?

సింహాచలం దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవో లేకపోవడంతో ఇన్ఛార్జీల పాలనలోనే నెట్టుకొస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 16సార్లు ఈవోలను మర్చారు. వెయ్యేళ్లకు పైగా చరిత్ర, వేల ఎకరాల భూములన్న దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవో లేకపోవడంతో పాలన గాడి తప్పుతోంది. భక్తుల సేవల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం విశాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న సుజాత పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో ఈవోగా కొనసాగుతున్నారు.
News November 19, 2025
ASF: 18 ఏళ్లు నిండిన మహిళకు చీరలు

రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ‘ఇందిరమ్మ మహిళా శక్తి’ పథకం కింద ఏకరూప చీరలు పంపిణీ చేయాలని సీఏం రేవంత్ రెడ్డి సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ఆయన ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఏఎస్ఎఫ్ కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో చర్చించి పంపిణీ ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు.


