News March 11, 2025
సత్యసాయి జిల్లాలో 543 మంది గైర్హాజరు

జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులలో 12,320 మంది విద్యార్థులకు గానూ 11,877మంది హాజరైనట్లు డీఐఈఓ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులలో 1,642మందికి గానూ 1,542 మంది హాజరయ్యారన్నారు. 543 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు.
Similar News
News March 19, 2025
అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా

TG: అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా పడింది. ఇరు సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి శుక్రవారం అసెంబ్లీ ప్రారంభం కానుంది.
News March 19, 2025
సంగారెడ్డి: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

జిల్లాలో ఈనెల 5 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయని సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడంతో పాటు త్వరలోనే ఫలితాలను విడుదల చేసేందుకు స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
News March 19, 2025
NLG: లక్ష ఎకరాలకు సాగునీరు.. 107 గ్రామాలకు తాగునీరు

ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 94 గ్రామాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు, ఫ్లోరైడ్ సమస్య ఉన్న 107 గ్రామాలకు తాగునీటిని అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 6.70 TMCల నీటిని బ్రాహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు లిఫ్ట్ చేస్తామన్నారు.