News March 29, 2025

సత్యసాయి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

image

ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్టు ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు దినంగా ప్రకటించినందున కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Similar News

News December 1, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

image

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని మౌలిక సదుపాయాలు, భద్రత, సభాస్థలి, రవాణా నిర్వహణ వంటి అంశాలను అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. రేపు జరగనున్న ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి లోపాలు లేకుండా పనిచేయాలని అధికారులకు సూచనలు చేశారు.

News December 1, 2025

సంస్కరణల ప్రభావం.. నవంబర్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

image

జీఎస్టీ సంస్కరణల ప్రభావం నవంబర్ వసూళ్లపై పడింది. అక్టోబర్‌లో రూ.1.96 లక్షల కోట్లు వసూళ్లవ్వగా నవంబర్‌లో రూ.1.70 లక్షల కోట్లకే పరిమితమైంది. 2024 నవంబర్‌లో రూ.34,141 కోట్లుగా ఉన్న CGST వసూళ్లు ఈ ఏడాది రూ.34,843 కోట్లకు పెరిగాయి. అయితే, SGST వసూళ్లు మాత్రం రూ.43,047 కోట్ల నుంచి రూ.42,522 కోట్లకు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.50,093 కోట్ల నుంచి రూ.46,934 కోట్లకు పడిపోయాయి.

News December 1, 2025

2026లోనే తేలనున్న కృష్ణా జలాల వివాదం!

image

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్-II తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదని కేంద్రమంత్రి రాజ్ భూషణ్ వెల్లడించారు. నిర్ణయాన్ని వెల్లడించేందుకు గడువు పొడిగించాలని ట్రిబ్యునల్ కోరిందన్నారు. దీంతో 2025 AUG 1 నుంచి జులై 31 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఎంపీ అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో నీటి పంపకాల పంచాయితీకి వచ్చే ఏడాదే ముగింపు దొరకనుంది.