News October 16, 2024

సత్యసాయి: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

15 సంవత్సరాలు నిండిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. వయోజన విద్య అభివృద్ధిపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో మంగళవారం రాత్రి గూగుల్ మీట్ విధానం ద్వారా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

Similar News

News November 14, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో ఉపాధ్యాయుడి సస్పెండ్

image

పుట్టపర్తి మండల పరిధిలోని బడే నాయక్ తండాలో ప్రభుత్వ టీచర్ శంకర్ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మద్యం తాగి పాఠశాలలో విధులకు హాజరవుతున్నారని, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లితండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనను హెచ్చరించారు. తీరు మారకపోవడంతో చర్యలు తీసుకున్నారు.

News November 14, 2024

అనంతపురంలో ముగ్గురి అరెస్ట్.. 21 తులాల బంగారం స్వాధీనం

image

అనంతపురంలోని కృపానంద నగర్‌లో ఇటీవల చోరీ జరిగింది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 48 గంటల్లో కేసును ఛేదించారు. బుధవారం ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువ చేసే 21 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. పరిచయస్థులే ఈ చోరికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు చేధించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

News November 14, 2024

శ్రీరెడ్డిపై అనంతపురంలో పోలీసులకు ఫిర్యాదు

image

నటి శ్రీరెడ్డిపై తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌‌లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. సీఐ సాయినాథ్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా శ్రీరెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.