News January 27, 2025

సత్యసాయి: పంటకాలువలో పసికందు మృతదేహం

image

బుక్కపట్నం మండల కేంద్రంలోని రామస్వామి గుడి సమీపంలో సోమవారం ఉదయం వ్యవసాయ కాలువలో నెలలు నిండని చిన్నారి మృతదేహం కలకలం రేపింది. నీళ్లలో కొట్టుకుంటూ వెళ్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పూడ్చేసినట్లు సమాచారం.

Similar News

News October 16, 2025

కృష్ణా: మన బందరు లడ్డు చరిత్ర ఇదే

image

నేడు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా 2017లో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్(GI) టాగ్ తెచ్చుకున్న మన బందరు లడ్డు చరిత్ర మీకు అందిస్తున్నాం. 17వ శతాబ్దంలో బుందేల్‌ఖండ్(UP) నుంచి బందరుకు వలస వచ్చిన రామ్‌సింగ్ కుటుంబం తొలుత ఈ లడ్డులు ఇక్కడ విక్రయించేవారు. వారి నుంచి స్థానికంగా నివసిస్తున్న వ్యాపారాలు బందరు లడ్డులను తయారుచేస్తూ మన బందరు లడ్డు ఖ్యాతిని దశదిశలా విస్తరింపచేశారు.

News October 16, 2025

ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి..? సాధ్యమేనా..?

image

<<18020734>>కొండా సురేఖ<<>>ను మంత్రి పదవి నుంచి తప్పించడం/ రాజీనామా చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే BC వర్గానికి చెందిన సురేఖ ప్లేస్‌ను అదే సామాజిక వర్గానికి చెందిన వేములవాడ MLA ఆది శ్రీనివాస్‌తో భర్తీ చేస్తారన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. CMకి సన్నిహితుడిగా, వివాదరహితుడిగా ఆదికి పేరుంది. అయితే ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్న నేపథ్యంలో నాల్గో మంత్రి పదవి సాధ్యమేనా? చూడాలి.

News October 16, 2025

నిర్మల్: తూపాకి పట్టి సరిగ్గా 40 ఏళ్లు..!

image

సరిగ్గా 40 ఏళ్ల కిందట జనం వీడి వనంలోకి వెళ్లిన మోహన్ రెడ్డి MH CM ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోయారు. నిర్మల్ జి. సోన్ మం. కూచన్ పెల్లికి చెందిన మోహన్ రెడ్డి 1960లో జన్మించాడు. 1976లో టెన్త్ పూర్తి చేసి ITI కోసం మంచిర్యాలకు వెళ్లాడు. అక్కడ పీపుల్స్ వార్ భావజాలానికి ఆకర్షితుడై 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2007లో జార్ఖండ్‌లో ఆయుధాల డెన్‌తో పోలీసులకు దొరికి జైలుకు వెళ్లి 2011లో విడుదలయ్యారు.