News January 27, 2025
సత్యసాయి: పంటకాలువలో పసికందు మృతదేహం

బుక్కపట్నం మండల కేంద్రంలోని రామస్వామి గుడి సమీపంలో సోమవారం ఉదయం వ్యవసాయ కాలువలో నెలలు నిండని చిన్నారి మృతదేహం కలకలం రేపింది. నీళ్లలో కొట్టుకుంటూ వెళ్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పూడ్చేసినట్లు సమాచారం.
Similar News
News February 9, 2025
పల్నాడు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

పల్నాడు జిల్లా ముప్పాళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
News February 9, 2025
కడపలో పాఠశాల విద్యార్థి ఆత్మహత్య

కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో గల నారాయణ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మదన్ మోహన్ రెడ్డి అనే విద్యార్థి ఈరోజు మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరివేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది రిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు కొప్పర్తి గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు.
News February 9, 2025
కరీంనగర్: వ్యక్తిని ఢీకొన్న బైక్.. స్పాట్‌లో మృతి

జిల్లాలోని రామడుగు మండలం వెదిర గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొలిపూరీ మైసయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడు బస్ స్టాండ్ నుంచి ఇంటికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన బైక్ అతడిని ఢీ కొట్టిందని, దీంతో అతడి తలకు తీవ్ర గాయమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.