News August 10, 2024
సత్యసాయి: పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని వివిధ శాఖల అమలు చేస్తున్న పథకాలను సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేత సమీక్షించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో కలెక్టర్ చర్చించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాల కోసం 15వ తేదీలోగా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News September 18, 2024
నేడు అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం
అమరావతిలో ఇవాళ మధ్యాహ్నం ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవిత, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.
News September 18, 2024
ఈ పండుగ అనంతపురం జిల్లాకే పరిమితం!
అనంతపురం జిల్లాలో నేడు మాల పున్నం జరుపుకుంటున్నారు. మహాలయ పౌర్ణమి పండుగను పల్లె ప్రజలు ‘మాల పున్నం’ అంటారు. ఈ పండుగ వచ్చే నాటికి పొలంలో విత్తనాలు వేసి ఉంటారు. ఏటా ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరులో జరుపుకుంటారు. ఇది మాంసాహార పండుగ. ఈరోజున సాయంత్రం పూట కోలాట వేషాలు, కోళ్ల పందేలు కాలక్షేపం కోసం సరదాగా ఆడతారు. ప్రత్యేకంగా హరిజనులు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. రాష్ట్రంలో మరెక్కడా మాల పున్నమిని జరుపుకోరు.
News September 18, 2024
బెంగళూరు-ధర్మవరం ప్యాసింజర్ రైలు అనంతపురం వరకు పొడిగింపు
బెంగళూరు నుంచి ధర్మవరం వరకు నడుస్తున్న 06515/06516 ప్యాసింజర్ రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారి బీఎస్ క్రిస్టోఫర్ ఆదేశాలు జారీచేశారు. సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం మీదుగా అనంతపురం వెళ్తుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వినతి మేరకు పొడిగించినట్లు తెలిపారు.