News March 19, 2025
సత్యసాయి: ‘పది సూత్రాలు తప్పక అమలు చేయాలి’

స్వర్ణాంధ్ర విజన్ 2047కు పది సూత్రాలు కచ్చితంగా అమలు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని పలు శాఖల అధికారులను ఆదేశించారు. నియోజకవర్గం స్థాయిలో విజన్ డాక్యుమెంట్ కార్యరూపం దాల్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
Similar News
News November 15, 2025
పేదల తరఫున గొంతెత్తుతూనే ఉంటాం: RJD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ ఫలితాలపై తొలిసారి స్పందించింది. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అని, దానికి అంతం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొంది. ఓటమితో విచారం.. గెలుపుతో అహంకారం ఉండబోదని తెలిపింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 25 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే.
News November 15, 2025
విశాఖ-కాకినాడ-భీమిలి నుంచి క్రూయిజ్ టూరిజంపై చర్చ

కోర్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో కోస్టల్ టూరిజాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఇందుకు కోర్డెలియా క్రూయిజెస్ కలిసి రావాలని సీఎం కోరారు. విశాఖ-కాకినాడ-భీమిలి పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై చర్చించారు. క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్పై కోర్డెలియా క్రూయిజెస్ ఆసక్తి చూపింది.
News November 15, 2025
రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

బెంగళూరులోని <


