News March 7, 2025

సత్యసాయి: ఫోన్ మహిళల జీవితాలను మారుస్తుంది.!

image

ఒకే ఒక సెల్ ఫోన్ మహిళల జీవితాలను మారుస్తుందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. మహిళ వారోత్సవాల్లో భాగంగా.. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో షార్ట్ ఫిలిం ద్వారా, సెల్ఫోన్ వాడకం, సైబర్ నేరాలు, వాట్సప్ వంటి వాటిపై జరిగే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించారు. నిత్యజీవితంలో సెల్ ఫోన్ మహిళల జీవితాలపై విపరీతమైన ప్రభావం చూపుతోందన్నారు.

Similar News

News December 3, 2025

ముందుగా ఆర్డినెన్స్.. తర్వాత వీలిన నోటిఫికేషన్

image

గ్రేటర్ HYDలో మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి ఆర్డినెన్స్ రావాల్సి ఉంది. వీలీన ప్రక్రియను గవర్నర్ ఇప్పటికే ఆమోదించడంతో త్వరలో ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆ తర్వాత 3 రోజులకు ఇందుకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వస్తుంది. ఇందుకోసం అధికారులు పేపర్‌వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వార్డుల విభజనకు సంబంధించి ప్రజాభిప్రాయం కూడా సేకరించనున్నారు.

News December 3, 2025

యాదాద్రి: రాజ్యాంగ నిర్మాత ఆశీస్సులతో నామినేషన్

image

రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా BSP మండలాధ్యక్షుడు నకిరేకంటి నరేశ్ మంగళవారం రాత్రి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ నిర్మాత డా.BR.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆశీస్సులు తీసుకుని నామినేషన్ కేంద్రం వరకు ర్యాలీగా వెళ్లారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. నియోజకవర్గ అధ్యక్షుడు గూని రాజు, పావురాల నరసింహ యాదవ్, మారయ్య, రాజు ఉన్నారు.

News December 3, 2025

సిరిసిల్ల: రెండో దశ.. పంచాయతీలకు 603 నామినేషన్లు

image

జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల కోసం 603 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 88 పంచాయతీలకు గాను చివరిరోజు మంగళవారం 292 నామినేషన్లు స్వీకరించగా మొత్తం నామినేషన్ల సంఖ్య 603కు చేరిందని అధికారులు తెలిపారు. 758 వార్డులకు గాను మంగళవారం 1,119 నామినేషన్లు రాగా మొత్తం 1,811 నామినేషన్లు అందినట్లు వివరించారు. నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించనున్నారు.