News January 27, 2025
సత్యసాయి: బాల్య వివాహాల నిలుపుదలకు కంట్రోల్ రూమ్

శ్రీ సత్యసాయి జిల్లాలో బాల్య వివాహాల నిలుపుదలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో సోమవారం కంట్రోలర్ ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు డైరెక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో బాల్య వివాహానికి సంబంధించి సమాచారం తెలిస్తే 08555-289610 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
Similar News
News October 19, 2025
KNR: యువజన మహిళా సంఘాల పాత్ర ఎంతో ముఖ్యం

ఉమ్మడి KNR జిల్లాలో ఉన్న యువజన మహిళా సంఘాల సమాచార జాబితాను తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో KNR జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ యువజన సమితి జిల్లా అధ్యక్షులు సత్తినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకలను గ్రామీణ ప్రాంతాలకు చెర వేసేందుకు యువజన మహిళా సంఘాల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలిపారు.
News October 19, 2025
‘K-Ramp’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ మూవీ నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టినట్లు Sacnilk ట్రేడ్ వెబ్సైట్ తెలిపింది. ఇండియాలో రూ.2.15 కోట్లు(నెట్ కలెక్షన్స్) వసూలు చేసినట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 37.10% ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు వెల్లడించింది.
News October 19, 2025
స్టార్ క్యాంపెయినర్లుగా కొండా సురేఖ, సీతక్క

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ క్యాంపెయినర్లను నియమించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తదితరులు స్టార్ క్యాంపెయినర్లుగా నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.