News January 27, 2025
సత్యసాయి: బాల్య వివాహాల నిలుపుదలకు కంట్రోల్ రూమ్

శ్రీ సత్యసాయి జిల్లాలో బాల్య వివాహాల నిలుపుదలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో సోమవారం కంట్రోలర్ ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు డైరెక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో బాల్య వివాహానికి సంబంధించి సమాచారం తెలిస్తే 08555-289610 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
Similar News
News February 7, 2025
‘వందే భారత్’లో ఫుడ్ ఆప్షన్‌పై కీలక నిర్ణయం

‘వందే భారత్’ రైళ్లలో ‘పుడ్ ఆప్షన్’ డెలివరీపై రైల్వే బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ బుక్ చేసే సమయంలో పుడ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోకపోయినా అప్పటికప్పుడు ఆహారం కొనుగోలు చేయొచ్చని తెలిపింది. అయితే, ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్న సమయంలోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఫుడ్ విషయంలో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రైల్వే బోర్డ్ IRCTCలో ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది.
News February 7, 2025
TPT: ఇటీవలే రిటైర్మెంట్.. అంతలోనే సూసైడ్

తిరుమలలో భార్యాభర్త <<15390232>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసుల నాయుడు(60) కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో పనిచేశారు. ఇటీవలే ఆయన రిటైరయ్యారు. శేష జీవితం ప్రశాంతంగా గడపాల్సిన ఆయన తిరుమలకు వెళ్లి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బలవన్మరణానికి పాల్పడటానికి కారణాలేంటి అనేది ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను తిరుపతి రుయాకు తరలించారు.
News February 7, 2025
ఉ.గో జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమలాపురం చెందిన బండారు రామ్మోహన్ రావు నామినేషన్ వేశారు. ఏలూరు కలెక్టరేట్‌లో ఒక సెట్ నామినేషన్ శుక్రవారం దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పాటు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలుపై పోరాడిన అనుభవం తనకు ఉందన్నారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.