News March 25, 2025

సత్యసాయి: భార్యపై హత్యాయత్నం.. భర్తకు పదేళ్ల జైలు శిక్ష

image

భార్యపై హత్యాయత్నం చేసిన కేసులో భర్తకు న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించిందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. పుట్టపర్తి రూరల్ మండలంలోని వెంకటగారిపల్లి గ్రామానికి చెందిన గాయత్రిపై భర్త రాజశేఖర్ హత్యాయత్నం చేయగా 2017 అక్టోబర్ 11న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం రుజువు కావడంతో అనంతపురం జిల్లా న్యాయమూర్తి శోభారాణి నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధించింది.

Similar News

News November 10, 2025

ఆదిలాబాద్: కొనసాగుతున్న అనిశ్చితి..!

image

డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. హైకమాండ్ నిర్ణయం వాయిదా పడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాల వారీగా పేర్లను ఖరారు చేసినప్పటికీ, చివరి ఆమోదం కోసం వేచిచూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలస్యం కారణంగా జిల్లా స్థాయి పార్టీ కార్యకలాపాలు మందగిస్తున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ADBలో ఎవరెవరు అధ్యక్షులైతే బాగుంటుందో కామెంట్ చేయండి.

News November 10, 2025

రూ.5,200 కోట్లతో విశాఖలో లారస్ ల్యాబ్స్

image

AP: ప్రముఖ డ్రగ్ కంపెనీ లారస్ ల్యాబ్స్ విశాఖలో దాదాపు రూ.5,200 కోట్లతో అత్యాధునిక మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం 532 ఎకరాలను కేటాయించిందని సంస్థ ఫౌండర్ చావా సత్యనారాయణ తెలిపారు. ఔషధ కంపెనీల్లో కీలకమైన ఫర్మంటేషన్ ప్లాంట్‌నూ ఇక్కడే ఏర్పాటుచేస్తామన్నారు. ప్రస్తుతం ఏటా రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు.

News November 10, 2025

సాహితీ శిఖరం నేలకొరిగింది: సీఎం రేవంత్

image

TG: అందెశ్రీ మరణంపై CM రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.