News March 19, 2025

సత్యసాయి: వినియోగదారులకు అందుబాటులో ఇసుక

image

ఇసుకను వినియోగదారులకు అందుబాటులో ఉంచుదామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్.చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా ఎస్పీ రత్నతో కలసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నీటి ప్రవాహాలకు ఆనుకుని ఉన్న గ్రామాలలో గృహాల నిర్మాణం, ప్రభుత్వ పనులకు ఇసుకను ఉచితంగా తీసుకెళ్ళవచ్చునన్నారు.

Similar News

News October 18, 2025

అఫ్గాన్‌‌‌ నుంచి టిప్స్ తీసుకోండి.. BCCI, కేంద్రంపై శివసేన ఫైర్!

image

పాక్ దాడుల్లో క్రికెటర్ల మృతితో ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు అఫ్గాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో Asia Cupలో పాక్‌తో టీమ్ ఇండియా ఆడటాన్ని గుర్తు చేస్తూ శివసేన(UBT) ఫైర్ అయింది. క్రీడల కంటే దేశానికి ప్రాధాన్యం ఇచ్చే విషయంలో Afghan నుంచి BCCI, కేంద్రం టిప్స్ తీసుకోవాలని మండిపడింది. PAKతో సిరీస్‌ను Afghan రద్దు చేసుకోవడం ఆనందం కలిగించిందని ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు.

News October 18, 2025

నిర్మల్: సాంకేతిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ ఏర్పాటు

image

జీవో నంబర్ 317 ప్రకారం తమ సొంత జిల్లా స్థాయి కేడర్‌లో మారి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బదిలీ కోరే ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి సాంకేతిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఇబ్బందులు ఎదురైతే 9000906181 నంబర్‌కు సంప్రదించాలన్నారు. దీంతో సాంకేతిక సమస్యలు నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.

News October 18, 2025

యాదాద్రి: అనుకూలిస్తున్న వాతావరణం.. కొనుగోళ్లకు సిద్ధం

image

జిల్లాలో వరుస వానలతో భయపెట్టిన వరుణుడు గత 3 రోజులుగా కాస్త కరుణించాడు. ప్రస్తుతం వాతావరణం రైతులకు అనుకూలంగా ఉంది. ఉదయం పొగమంచు, ఆ తర్వాత ఎండ వస్తుండటంతో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని, పత్తిని రైతులు ఎండబెడుతున్నారు. తిరిగి వరి కోతలు ప్రారంభించి, ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కేంద్రాలను సిద్ధం చేయడంతో కొనుగోలు ప్రక్రియ త్వరలో మొదలుకానుంది.