News April 1, 2025
సత్యసాయి: ‘15 రోజుల్లో నీటి తొట్టెలు పూర్తి చేయాలి’

శ్రీ సత్యసాయి జిల్లాకు మంజూరైన నీటి తొట్టెలను 15 రోజులలో నిర్మించి పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి మండలంలోని కప్పల బండలో నీటి తొట్టె నిర్మాణానికి భూమి పూజ చేసి, అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు 1362 నీటి తొట్టెలు మంజూరు అయ్యాయని అన్నారు. నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని మూగజీవాలకు తాగునీటి సౌలభ్యం కొరకు వెంటనే నిర్మాణం చేపట్టాలన్నారు.
Similar News
News April 4, 2025
మార్కాపురంలో యువకుడు ఆత్మహత్య

మార్కాపురం కాలేజీ రోడ్డులోని జాకీ షోరూమ్ లో పనిచేస్తున్న మహేశ్ అనే యువకుడు గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆళ్లగడ్డకు చెందిన మహేశ్ జీవనోపాధి కోసం కొంతకాలం క్రితం మార్కాపురం వచ్చాడని స్థానికులు తెలిపారు. నమ్మిన వారందరూ మోసం చేశారని జీవితం మీద విరక్తితో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 4, 2025
అల్లూరి: 5302 టెన్త్ పేపర్స్ మూల్యాంకనం

అల్లూరి జిల్లా కేంద్రం అయిన పాడేరులో పదోతరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ గురువారం ప్రారంభమైంది. వివిధ సబ్జెక్ట్స్కు చెందిన 5302 పేపర్స్ దిద్దినట్లు DEO బ్రహ్మాజీరావు మీడియాకు తెలిపారు. ఇంగ్లిష్ 1533, మ్యాథ్స్ 870, ఫిజికల్ సైన్స్ 994, బయలాజికల్ సైన్స్ 1120, సోషల్ స్టడీస్ 785 పేపర్స్ మూల్యాంకనం చేసినట్లు చెప్పారు. మొత్తం 370 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు.
News April 4, 2025
KMR: షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఖాయమేనా?

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న షబ్బీర్ ఆలీకి మంత్రి పదవి దక్కడం ఖాయమని చర్చ జరుగుతోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంత్రి వర్గ విస్తరణలో ఒక మైనార్టీ ఉంటారని చేసిన ప్రకటన ఇందుకు ఊతం ఇస్తోంది. ఈ ప్రకటన.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీల ఎంపికలో చోటు దక్కక నిరాశలో ఉన్న షబ్బీర్ ఆలీతో పాటు ఆయన అనుచరుల్లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది.