News November 11, 2024
సత్వర పరిష్కారానికి కృషిచేయండి: కలెక్టర్ నిధి మీనా
పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న ప్రతి అర్జీని పరిశీలించి సత్వర పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు.
Similar News
News December 11, 2024
కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 22 పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO డా. గీతాబాయి తెలిపారు. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-2 నాలుగు పోస్టులు, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లి ఎనిమిది పోస్టులు, శానిటరీ అటెండర్ కం వాచ్ మెన్ 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్షత గల వారు ఈ నెల 16 లోపు డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేయాలన్నారు.
News December 11, 2024
కృష్ణా: పీజీ పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో సైన్స్, ఆర్ట్స్ గ్రూపులలో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి 2025 జనవరి 10 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని కోరింది.
News December 11, 2024
విజయవాడలో అత్యాచార నిందితుడికి శిక్ష, జరిమానా
2015లో మొఘలరాజపురంకు చెందిన ఇంటర్ చదివే బాలిక(17)ను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి రేప్ చేసిన పోతిన నాని(21)కి కోర్టు 10ఏళ్ల కఠిన కారాగార శిక్షవిధించింది. నాని ఆమెను అపహరించడంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 2015లో మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం పోక్సో కోర్ట్ జడ్జి వి.భవాని ఈ కేసులో తుది తీర్పు చెప్పారు. నేరం ఋజువైనందున నానికి కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించారు.