News January 28, 2025

సదరం క్యాంపు తేదీల ప్రకటన

image

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరం తేదీలను ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆర్థోకి సంబంధించిన వారు ఫిబ్రవరి 3, 4 & మార్చి 4, మానసిక రోగులు ఫిబ్రవరి 6 & మార్చి11, కంటి చూపు ఫిబ్రవరి 10 & మార్చి 18న, చెవిటి మూగవారికి ఫిబ్రవరి 13 & మార్చి 24 తేదీలలో క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీసేవ కేంద్రాలలో స్లాట్ బుక్ చేసుకొని నిర్ధారించిన తేదీలో రసీదు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలన్నారు.

Similar News

News February 16, 2025

జగిత్యాల: కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో JGTL(D) ధర్మపురికి చెందిన వెంగళ ప్రమీల చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. 10 రోజులక్రితం కుటుంబసభ్యులతో కలిసి 2 కార్లలో కుంభమేళాకు వెళ్లి వస్తుండగా గురువారం ఒక కారుకు ప్రమాదం జరిగింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రమీల మృతిచెందింది. ప్రమీల గోదావరి నది తీరాన కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

News February 16, 2025

పన్నుల వసూళ్లలో హుజూరాబాద్ రెండో స్థానం

image

ఇంటి పన్నుల వసూళ్లలో HZB మున్సిపాలిటీ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని కమిషనర్ సమ్మయ్య తెలిపారు. గతంలో వసూళ్లలో 5వ స్థానంలో ఉన్నదానిని తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల సహకారంతో రూ.2.03కోట్లు వసూలుచేసి, 76.95శాతం వసూళ్లతో రికార్డు సాధించగలిగామన్నారు. మున్సిపల్ పరిధిలో ఇంటి పన్ను కట్టేవారు 9,431 మంది ఉన్నారన్నారు. ఉద్యోగులు, ప్రజల సహకారంతో రాష్ట్రంలో మొదటి స్థానం కోసం కృషి చేస్తున్నామన్నారు.

News February 16, 2025

కరీంనగర్: చికిత్స పొందుతూ యువరైతు మృతి

image

శంకరపట్నం(M) ఇప్పలపల్లె గ్రామానికి చెందిన ఏడీగ మధు(33) అనే ఓ యువరైతు 6రోజుల క్రితం తన ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. గమనించిన చుట్టుపక్కల వారు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!