News October 27, 2024

సదర్: దద్దరిల్లనున్న హైదరాబాద్!

image

సదర్‌ ఉత్సవాలకు హైదరాబాద్ ముస్తాబైంది. నేటి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు NTR స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇక దీపావళి వేళ నగరానికి దున్నపోతుల విన్యాసాలు ప్రత్యేక శోభను తీసుకొస్తాయి. నారాయణగూడ, ఖైరతాబాద్, ముషీరాబాద్‌, అమీర్‌పేట‌తో పాటు HYDలోని యాదవ సోదరులు నార్త్ ఇండియా నుంచి బలమైన దున్నరాజులను తీసుకొస్తున్నారు. ఈ ఏడాది సదర్ సయ్యాటలతో హైదరాబాద్‌ దద్దరిల్లనుంది.

Similar News

News November 23, 2025

ఇలా అయితే భవిష్యత్‌లో HYDకు గండమే!

image

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల వరద ప్రవాహాంతో వచ్చే వ్యర్థాలు అడుగున చేరి నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. ఇటీవల నీటి వనరుల విభాగం ఉన్నతస్థాయి కమిటీ పరిశీలనలో భారీగా పూడిక పేరుకుపోయి నీటి సామర్థ్యం సాధారణ స్థాయి కంటే తగ్గుముఖం పట్టినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నీటి సామర్థ్యం 60% కంటే దిగువకు పడిపోతే భవిష్యత్తులో నీటి తరలింపు సమస్యగా మారే ప్రమాదం ఉందని వెల్లడైంది.

News November 23, 2025

HYD: 25న బల్దియా సర్వసభ్య సమావేశం

image

మరో రెండున్నర నెలల్లో జీహెచ్ఎంసీ పాలకమండలి ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదానికి మాత్రం ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో చివరి సమావేశం కావడంతో ప్రధాన ప్రతిపక్షమైన BRSకు, కాంగ్రెస్‌కు మధ్య మాటల యుద్ధం తప్పకపోవచ్చని సమాచారం.

News November 23, 2025

DANGER: HYDలో వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

వాటర్ హీటర్ ప్రమాదాలు నగరంలో కలవరపెడుతున్నాయి. పోలీసుల వివారలిలా.. మియాపూర్‌ దావులూరి హోమ్స్‌లో హౌస్‌కీపింగ్ ఉద్యోగిని శివలీల (32) శనివారం వాటర్ హీటర్‌ షాక్ తగిలి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత హీటర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని, నాణ్యమైనవి కొనాలని, చేతులు తుడుచుకుని, చెప్పులు ధరించి స్విచ్ఆఫ్ చేశాకే ప్లగ్ పట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.