News February 9, 2025

సదాశివనగర్‌: బావిలో పడి యువకుడి మృతి

image

వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. SI రంజిత్ వివరాలిలా.. స్థానిక సిద్ధి రాములు(17) ఆదివారం ఉదయం కాల కృత్యాలు తీర్చుకోవడానికి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి మృతి చెందాడు. మృతుని తండ్రి గంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వెల్లడించారు.

Similar News

News March 27, 2025

గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం వాయిదా

image

ఈనెల 29వ తేదీన గుంటూరులో జరగనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా బుధవారం తెలిపారు. 2025-26వ సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వ పథకాలను అదనంగా చేర్చ వలసి ఉన్నందున అదే విధంగా మెజార్టీ సభ్యులు కొంత సమయం కోరిన కారణంగా వాయిదా వేసినట్లు ఛైర్‌పర్సన్ తెలిపారు. 

News March 27, 2025

కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లకు ఢిల్లీలో శిక్షణ

image

అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ ఆధ్వర్యంలో “నేతృత్వ సృజన్” పేరుతో మహిళా నాయకత్వ శిక్షణ తరగతులు న్యూఢిల్లీలో 2 రోజులపాటు జరిగాయి. ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లి శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, తదితరులు ఉన్నారు.

News March 27, 2025

కునాల్‌కు మద్దతుగా అభిమానులు..రూ. లక్షల్లో విరాళాలు

image

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు తన అభిమానుల నుంచి రూ.లక్షల్లో ఆర్థిక సాయం అందుతోంది. విదేశాల నుంచి ఒక అభిమాని రూ.37,000 పంపించిన ఫోటోని ఓ అభిమాని Xలో షేర్ చేశారు. యూట్యూబ్ ‘సూపర్ థాంక్స్’ ఫీచర్‌ ద్వారా విరాళాలు అందజేస్తున్నారు. కునాల్‌పై కేసు నమోదైన నేపథ్యంలో లీగల్ ఖర్చుల అవసర నిమిత్తం అభిమానులు డబ్బు పంపిస్తున్నారు. DY.cm ఏక్‌నాథ్ శిండేపై కామెడీ స్కిట్ చేసినందుకు కునాల్ పై కేసు నమోదైంది.

error: Content is protected !!