News February 8, 2025
సదాశివనగర్: బావిలో పడి వృద్ధురాలి ఆత్మహత్య
బావిలో పడి ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ రంజిత్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుశీల(70) గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆమె జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి గ్రామ శివారులోని బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ వెల్లడించారు.
Similar News
News February 8, 2025
HYD: మాజీ రాష్ట్రపతికి సీఎం నివాళులు
మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. జాకీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు చామల కిరణ్ కుమార్, మల్లు రవి, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
News February 8, 2025
షాద్నగర్: 10న అప్రెంటిస్ షిప్ మేళా
షాద్నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 10వ తేదీన అప్రెంటిస్ షిప్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 గం.లకు కళాశాలలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News February 8, 2025
శ్రీకాకుళం: ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన ఎస్సీ
పొందూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళ్తే స్థానిక మండలంలోని కాజీపేట వద్ద జరిగిన కొట్లాట కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ చర్యలు తీసుకున్నామని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. కాగా ఈ కొట్లాటకు సంబంధించి హత్యాయత్నం కేసు నమోదైందన్నారు. కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం దీనికి కారణమన్నారు.