News February 22, 2025

సదాశివనగర్: సంతానం కలగలేదని మహిళ బలవన్మరణం..

image

సంతానం కలగలేదనీ తీవ్ర మనస్తాపం చెందిన మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సదాశివనగర్ గురువారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలిలా..అమర్లబండ వాసి ఎర్రోల రాజయ్య కు సత్తెవ్వ తో 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఇప్పటి దాకా పిల్లలు కాలేదు. దీంతో మన స్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి అన్న సాయిలు శుక్రవారం పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News November 13, 2025

17న ఎమ్మెల్యేల అనర్హత సహా అన్ని పిటిషన్లపై విచారణ

image

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లన్నిటినీ సోమవారం (17వ తేదీ) విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు నిర్దేశించిన 3 నెలల గడువులోగా ఫిరాయింపు MLAలపై చర్యలు తీసుకోలేదంటూ BRS ఇటీవల స్పీకర్‌పై ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై నిర్ణయానికి మరో 2నెలల సమయం కావాలని స్పీకర్ కార్యాలయం అంతకు ముందే SCని కోరింది. అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేస్తామని సుప్రీం తాజాగా స్పష్టం చేసింది.

News November 13, 2025

BOB క్యాపిటల్‌లో ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీఏ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in/

News November 13, 2025

MNCL: 17న మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

image

మంచిర్యాల శ్రీశ్రీ నగర్‌లోని ఆనంద నిలయంలో ఈ నెల 17న మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి భాస్కర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాల మహిళలకు ఈ కేంద్రంలో ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.