News January 30, 2025
సదాశివపేటలో కారు ఢీకొని మహిళ మృతి

సదాశివపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పట్టణలోని పీఎస్ఎంఎల్ కాలనీ ఎదురుగా హైవేపై గురువారం సంగారెడ్డి వైపు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 18, 2025
150 లిక్కర్ షాపులకు ఏపీ మహిళ దరఖాస్తు

TG: మద్యం షాపుల దరఖాస్తులు నేటితో ముగిశాయి. మొత్తం 90వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసింది. ఆమె ఏపీకి సరిహద్దు జిల్లాల్లోని షాపులకు ఎక్కువగా దరఖాస్తులు చేసిందని అధికారులు చెబుతున్నారు. యూపీ, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా చాలా మంది మహిళలు అప్లై చేసుకున్నారు. ఈనెల 23న లైసెన్స్‌ల కోసం డ్రా నిర్వహించనున్నారు.
News October 18, 2025
ఆలేరులో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. శనివారం ఆయన ఆలేరు మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు ఎంత ధాన్యం వచ్చింది? ఎంతవరకు కొనుగోలు చేశారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News October 18, 2025
ఆడపిల్లలకు చదువుకునే హక్కు ప్రతి ఒక్కరూ ఇవ్వాలి: కలెక్టర్

ఆడపిల్లలందరికీ చదువుకునే హక్కు తప్పకుండా ఇవ్వాలని, వారికి పౌష్టికాహారం అందించి, సమాజంలో లింగ వివక్ష లేకుండా చూడాలని ఇవాళ కలెక్టర్ సిరి అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో అన్నారు. జిల్లాలో కేవలం 56 శాతం ఉన్న అక్షరాస్యత రేటును 100 శాతంకి పెంచాలని కోరారు. విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో రాణించాలని, విద్యకు ప్రభుత్వం ఉచిత సౌకర్యాలు అందిస్తోందని, బాలికల రక్షణకు ‘స్త్రీ శక్తి’ యాప్ ఉందని పేర్కొన్నారు.