News April 10, 2025
సదాశివపేట: మహిళా అదృశ్యం.. కేసు నమోదు

మహిళా అదృశ్యమైన ఘటన సదాశివపేట మండలంలో జరిగింది. సీఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాలు.. మండలంలోని రేజింతల్ గ్రామానికి చెందిన మారేపల్లి లక్ష్మి(45) ఈనెల 7న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లింది. కుటుంబ సభ్యులు వెతికిన ఆచూకీ లభించలేదు. బాధితురాలి కుమారుడు మారేపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం తెలిస్తే 8712656721 సంప్రదించాలన్నారు.
Similar News
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 1, 2025
అధ్యక్షా.. కడప – బెంగుళూరు రైలు రోడ్డు కథ కంచికేనా..?

మదనపల్లి జిల్లా కల నెరవేరింది. కడప- బెంగళూరు రైలు రోడ్డు వేస్తామని మరిచారు. అయితే ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన గళం వినిపించి కడప మదనపల్లి మీదుగా బెంగుళూరుకి రైల్వే రోడ్డుకు కృషి చేస్తారా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాజంపేట పరిధిలో బస్ షెల్టర్ల ఏర్పాటుపై చర్చించి, గతంలో మంజూరైన రైల్వే రోడ్డు, బస్ షెల్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తారా? చూడాలి.
News December 1, 2025
NGKL జిల్లాలో తగ్గిన చలి

నాగర్కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే చలి తీవ్రత కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో 18.1°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 18.3°C, తోటపల్లిలో 18.5°C, ఊర్కొండ, వెల్దండలలో 18.6°C, తాడూరులో 18.7°C, చారకొండ మండలంలో 18.8°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


