News August 3, 2024
సదుం: కోనేరులో పడి అవ్వ, మనుమడు మృతి
కోనేరులో పడి అవ్వ, మనుమడు మృతి చెందిన విషాదకర ఘటన సదుం మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పీలేరుకు చెందిన తులసమ్మ (55) మనవడు అద్విక్ (3) తో కలసి మండలంలోని కొత్తపల్లిలో జరుగుతున్న గృహనిర్మాణం పరిశీలించేందుకు వచ్చారు. శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో విరుపాక్షమ్మ ఆలయం వద్దనున్న కోనేరులో ఇద్దరూ ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు.
Similar News
News September 13, 2024
చిత్తూరు: రేపటి నుంచి స్వచ్ఛత హీ సేవ
జిల్లాలో రేపటి నుంచి అక్టోబర్ 1 వరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా అవగాహన సదస్సులు, ర్యాలీలు, వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు. గ్రామాలలో శ్రమదానం చేయాలని సూచించారు. కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
News September 13, 2024
ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆదిమూలం
లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో మధ్య చెన్నై అపోలో నుంచి ఆదిమూలం డిశ్ఛార్జి అయి ఇంటికి వచ్చారు. ఆయన పుత్తూరు నివాసానికి చేరుకున్నారని సమాచారం. ఆయన గన్‌మెన్, పీఏ సహా బంధుమిత్రులకు, పార్టీ శ్రేణులకు ఎవరికీ అనుమతి లేదని సమాచారం. బుధ, గురువారాల్లో TPT ఇంటెలిజెన్స్ పోలీసులు ఎమ్మెల్యేను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ గుండెకు స్టంట్ వేయించుకున్నానని రెండ్రోజుల్లో తానే వచ్చి కలుస్తానని ఆయన చెప్పారు.
News September 13, 2024
ప్రమాదాలకు నిలయంగా భాకరాపేట ఘాట్..?
భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. నెలలో కనీసం రెండు, మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాదికి 30 నుంచి 50 మంది వరకు ఈ రహదారిలో ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదాలు జరిగినపుడు పోలీసులు, రవాణ శాఖ అధికారులు వెళ్లి పరిశీలించడం మినహా.. ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న టమాటా లోడ్ కంటైనర్ ఢీకొనడంతో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే.