News January 17, 2025
సదుం: చిన్నారుల మృతికి కారణమైన తల్లి అరెస్ట్

చిన్నారులతో పాటు ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి.. వారి మృతికి కారకురాలైన తల్లిని అరెస్టు చేసినట్లు సీఐ రాంభూపాల్ మంగళవారం తెలిపారు. సదుం మండల కేంద్రానికి చెందిన కరిష్మా ఈనెల 12న తన ఇద్దరు చిన్నారులతోపాటు కరెంటు వైర్తో ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడగా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 6, 2025
బోయకొండ గంగమ్మ భక్తులకు గమనిక

బోయకొండ గంగమ్మ ఆలయంలో శాశ్వత నిత్యార్చన సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ఈవో ఏకాంబరం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారుల ఆదేశాలతో సంక్రాంతి నుంచి అమ్మవారికి శాశ్వత నిత్యార్చన నిర్వహిస్తామని చెప్పారు. ఏడాదికి రూ.10,116, 6నెలలకు రూ.7,116, 3నెలలకు రూ.5,116, నెలకు రూ.2,116తో సేవా టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కుంకుమార్చన రూ.101, వడి బాల సేవ రూ.201తో నూతన సేవలు ప్రవేశ పెడతామన్నారు.
News December 6, 2025
హోంగార్డుల సంక్షేమానికి కృషి: చిత్తూరు SP

హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని కవాతు ప్రదర్శనను వీక్షించారు. చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతల కోసం 357 మంది హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరి సేవలు ప్రశంసనీయమన్నారు. నేరాలను అరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటున్నారని కొనియాడారు.
News December 6, 2025
చిత్తూరు: అంగన్వాడీలకు నిధులు మంజూరు.!

చిత్తూరు జిల్లాలో అంగన్వాడీల మౌలిక వసతులకు రూ.8 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ శాఖ ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలను పేదలకు అందజేయాలని సూచించారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో నాగార్జున ఐఏఎస్ వీసీలో ఐసీడీఎస్ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అసంపూర్ణంగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, తాగునీరు, వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.


