News January 17, 2025

సదుం: చిన్నారుల మృతికి కారణమైన తల్లి అరెస్ట్

image

చిన్నారులతో పాటు ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి.. వారి మృతికి కారకురాలైన తల్లిని అరెస్టు చేసినట్లు సీఐ రాంభూపాల్ మంగళవారం తెలిపారు. సదుం మండల కేంద్రానికి చెందిన కరిష్మా ఈనెల 12న తన ఇద్దరు చిన్నారులతోపాటు కరెంటు వైర్‌తో ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడగా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Similar News

News February 9, 2025

నేటి నుంచి కుప్పం-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకలు

image

కుప్పం-బెంగళూరు మధ్య నేటి నుంచి యధావిధిగా రైళ్ల రాకపోకలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కుప్పం రైల్వే ట్రాక్ పనుల కారణంగా గడిచిన 15 రోజులుగా కుప్పం-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకల్లో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కుప్పం ప్రాంతానికి చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఆదివారం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

News February 8, 2025

చౌడేపల్లి: ప్రమాదం జరిగితే గానీ స్పందించరా..?

image

చౌడేపల్లి సోమల మార్గంలోని డ్యాం వద్ద రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు మధ్యలో కల్వట్టు కుంగడంతో గుంత ఏర్పడింది. వాహనదారులు ఆదమరిస్తే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగితే గానీ స్పందించరానంటూ ప్రజలు ప్రయాణికులు అధికారులు తీరుపై మండిపడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

News February 8, 2025

చిత్తూరు: రైలులో గర్భిణిపై అత్యాచారయత్నం

image

రైలులో గర్భిణిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన జోసెఫ్ భార్య 4నెలల గర్భిణి. ఆమె కోయంబత్తూరు- TPT ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కి పుట్టినిల్లు చిత్తూరు సమీపంలోని మంగసముద్రానికి బయలు దేరింది. వేలూరు జిల్లాకు చెందిన హేమరాజ్(28) మహిళా బోగిలో ఎక్కి ఆమె ఒంటరిగా ఉండడంతో అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి రైలు నుంచి బయటకు తోసేశాడు.

error: Content is protected !!