News February 13, 2025
సదుం: జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపిక

జాతీయ కబడ్డి సీనియర్ మహిళా విభాగం జట్టుకు సదుం కబడ్డీ క్లబ్ క్రీడాకారులు గుల్జార్, రుక్సానా ఎంపికైనట్టు చిత్తూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ రవీంద్ర రెడ్డి గురువారం తెలిపారు. డిసెంబర్లో ప్రకాశం జిల్లాలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపడంతో వారు ఎంపిక అయినట్లు ఆయన తెలిపారు. హర్యానాలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ క్రీడా పోటీల్లో ఏపీ తరఫున వారు పాల్గొంటారని పేర్కొన్నారు.
Similar News
News January 1, 2026
చిత్తూరు జిల్లాలో రూ.14 కోట్ల మందు తాగేశారు..!

చిత్తూరు జిల్లాలో డిసెంబరు 30న 7,500 బాక్సుల మద్యం, 2,500 బాక్సుల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా రూ.5.05 కోట్ల ఆదాయం వచ్చింది. 31వ తేదీన 4,900 మద్యం, 2400 బీరు బాక్సులు అమ్మడంతో రూ.3.78 కోట్లు సమకూరింది. బార్లలో రూ.2 కోట్లకు పైగా అమ్మకాలు జరగడంతో మొత్తంగా రెండు రోజులకు రూ.10.83 కోట్ల ఆదాయం చేకూరింది. జనవరి 1న రూ.2 కోట్లకు పైగా అమ్మకాలు జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
News January 1, 2026
చిత్తూరు అగ్రికల్చర్ జేడీ రిటైర్మెంట్

ఉద్యోగ జీవితంలో రిటైర్మెంట్ ఎంతో కీలకమని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ తెలిపారు. చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ ఉద్యోగ విరమణ సన్మాన సభ జరిగింది. ఎమ్మెల్యే హాజరయ్యారు. జేడీగా ఆయన ఉత్తమమైన సేవలందించారని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం మురళీకృష్ణ దంపతులను సత్కరించారు.
News January 1, 2026
రూ. 210 కోట్లతో SC, ST కాలనీల అభివృద్ధి : కలెక్టర్

చిత్తూరు జిల్లాలో SC, ST కాలనీల అభివృద్ధికి రూ.210 కోట్లతో ప్రణాళికలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 31/12/2025 నాటికి రూ. 120 కోట్లతో SC,ST కాలనీలను అభివృద్ధి చేసేందుకు నిధులు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 20 లక్షల జనాభా ఉండగా SC లు 4 లక్షలు, ST లు 65 వేలు ఉన్నారని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రూ.210 కోట్లతో ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు.


