News May 11, 2024
సద్దుల చెరువులో మహిళ మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన సూర్యాపేట సద్దుల చెరువులో శనివారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో సద్దుల చెరువులో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి తమకు సమాచారం ఇచ్చారన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న వారు మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు.
Similar News
News February 13, 2025
NLG: పెద్దగట్టు జాతరకు సెలవు ప్రకటించాలని వినతి

సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు శ్రీ లింగమంతులస్వామి వారి జాతర సందర్భంగా సోమవారం జిల్లాలోని విద్యాసంస్థలు, కార్యాలయాలకు ఒకరోజు సెలవు ప్రకటించాలని యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, నేతలతో కలిసి జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని వారు కోరారు.
News February 13, 2025
10 జీపీఏ సాధించిన వారిని విమానంలో తీసుకెళ్తా: కలెక్టర్

కేజీబీవీ విద్యార్థినులు 10వ తరగతిలో పదికి పది జీపీఏ మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె కనగల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో ముఖాముఖి నిర్వహించి.. వారితో సెల్ఫీ దిగారు. పదవ తరగతిలో 10-10 జీపీఏ సాధించిన వారిని విజయవాడ, చెన్నై లాంటి పట్టణాలకు విమానంలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
News February 13, 2025
NLG: ఎంజీయూలో నూతన నియామకాలు..

MG యూనివర్సిటీ పరీక్షల విభాగంలో అసిస్టెంట్ కంట్రోలర్‌గా డా. ఎం. రామచందర్ గౌడ్, కాంపీటేటీవ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్‌గా సోషల్ వర్క్ విభాగ అధిపతి, డా. ఎస్ శ్రవణ్ కుమార్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఒక ఏడాది పాటు ఆ స్థానాల్లో సేవలు అందించనున్నారు. సహ అధ్యాపకుల నియామకం పట్ల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.