News October 18, 2024

సనాతన ధర్మ పరిరక్షణకు యువకుడి సైకిల్ యాత్ర

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లికి చెందిన మల్లేశ్ దేశంలోని ద్వాదశ (12) జ్యోతిర్లింగాల దర్శనార్థం గురువారం సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. మొదటగా పాలమూరు నుంచి తాండూరు మార్గంలో యాత్ర సాగనుంది. రోజుకు 100 కి.మీ.లు సైకిల్ యాత్ర చేసి స్థానిక ఆలయాల్లో బస చేస్తానని తెలిపాడు. సనాతన ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ ఈ యాత్ర కొనసాగించనున్నట్లు అతడు పేర్కొన్నాడు.

Similar News

News October 26, 2025

MBNR: సాదాబైనామాల పరిష్కారానికి మోక్షం

image

సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం కలగనుంది. జీఓ 112 అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2020లో ఆన్‌లైన్‌లో వచ్చిన 4,217, ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 3,456 దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.

News October 25, 2025

బాలానగర్: పుట్టినరోజే.. చివరి రోజుగా మారింది..!

image

బాలానగర్ మండలంలోని పంచాంగుల గడ్డ తండాలో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. తాండవాసుల వివరాల ప్రకారం.. కేతావత్ విష్ణు (25) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులతో భూమి, డబ్బుల విషయంలో విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో 3 రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్స పొందుతూ.. ఈరోజు ఉదయం మృతి చెందాడు. పుట్టినరోజు నాడే.. మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News October 25, 2025

రేపు కురుమూర్తిస్వామి అలంకరణ మహోత్సవం

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన చిన్నచింతకుంట మండలం అమ్మపూర్‌లోని శ్రీ కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాలలో భాగమైన స్వామివారి అలంకరణ మహోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకులో ఉన్న స్వామి వారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని స్వామివారికి అలంకరించనున్నట్లు ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.