News October 16, 2024

సన్నబియ్యానికి రూ.500 బోనస్ ఇస్తాం: మంత్రి తుమ్మల

image

నల్గొండ ఎస్ఎల్‌బీసీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తుమ్మల చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Similar News

News November 5, 2024

చింతకాని: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

image

చింతకాని మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రతిభను చాటుకున్నారు. డీఎస్సీ 2024లో ఈ కుటుంబానికి చెందిన ముగ్గురు సూపర్ సక్సెస్‌ సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా జాబ్ కొట్టారు. ఈలప్రోలు కృష్ణారావు స్కూల్ అసిస్టెంట్‌గా, ఆయన సోదరుడు నరేష్, సోదరి సునీతలు ఎస్‌జీటీ పోస్టుల్లో సెలెక్ట్‌ అయ్యి విధుల్లో చేరారు. గ్రామస్థులు, బంధుమిత్రులు వారికి అభినందనలు తెలిపారు.

News November 5, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక అధికారిగా కె. సురేంద్ర మోహన్ నియామకం

image

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్​ను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కె. సురేంద్ర మోహన్‌‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు.

News November 5, 2024

పక్కా ప్రణాళికతో ఇంటింటి సర్వే: జిల్లా కలెక్టర్

image

ఖమ్మం: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కా ప్రణాళికతో, ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం కుటుంబ సర్వేకు సంబంధించి అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. జిల్లాలో సుమారు 6,33,304 కుటుంబాలున్నట్లు అంచనా ఉందన్నారు. ప్రతి ఇంటి సర్వేకు పటిష్ట ప్రణాళిక చేశామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.