News April 3, 2025
సన్న బియ్యం పంపిణీ చేసిన నల్గొండ కలెక్టర్

దిండి(గుండ్లపల్లి) మండలం కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఏఎస్పీ మౌనిక ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, కొత్త రేషన్ కార్డుల కోసం ఈ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 22, 2026
CM కప్.. ఫైనల్‌లో నల్గొండ హాకీ జట్టు

హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలలో నల్గొండ బాలుర హాకీ జట్టు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్‌లో వనపర్తి జట్టుపై 1-0 తేడాతో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. రేపు జరిగే ఫైనల్స్‌లో నిజామాబాద్ జట్టుతో తలపడనుంది. జట్టు విజయం పట్ల జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ హర్షం వ్యక్తం చేశారు.
News February 22, 2026
NLG: కుమ్మెర జాతరలో శిశువు మృతిపై NHRCకి ఫిర్యాదు

కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.
News February 22, 2026
NLG: SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మట్టి దిబ్బల కిందే తమ వారు కలిసిపోయారన్న వేదనలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు.


