News April 8, 2025
సన్న బియ్యం పంపిణీ చేసిన ఆసిఫాబాద్ కలెక్టర్

ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యంను ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ అన్నారు. మంగళవారం వాంకిడి డీఆర్డీపోలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ RDO లోకేశ్వర్ రావుతో కలిసి ప్రారంభించారు. జిల్లాలో అర్హులైన ప్రతి రేషన్ కార్డుదారుడు సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Similar News
News November 24, 2025
రాయచోటి: చంటి బిడ్డతో ఉద్యోగి నిరసన

రాయచోటిలోని కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ JAC ధర్నా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలు 15 నెలలుగా పరిష్కారం కాలేదని JAC జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్ రాజు తెలిపారు. HR పాలసీ అమలు, మినిమం టైమ్ స్కేల్, రెగ్యులరైజేషన్, జీతాల పెంపు, మెడికల్ సదుపాయాలు, EPF అమలు.. ఇలా పలు డిమాండ్లు చేశారు. ఈ నిరసనలో ఓ మహిళా ఉద్యోగి చంటి బిడ్డతో నిరసనలో పాల్గొంది.
News November 24, 2025
జంగారెడ్డిగూడెంలో 26న జాబ్ మేళా

జంగారెడ్డిగూడెం సూర్య డిగ్రీ కాలేజీలో ఈనెల 26న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్.జితేంద్ర బాబు తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్లో 17కి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సుమారు 1140 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలోని 18 సంవత్సరాల వయసు నిండి, 10వ తరగతి ఆపై చదివినవారు అర్హులన్నారు.