News April 1, 2025

సన్న బియ్యం పథకం చారిత్రాత్మకం: ఎమ్మెల్యే సామేలు

image

సన్న బియ్యం పథకం దేశంలోనే చారిత్రాత్మకమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. మంగళవారం నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు వెంకన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 28, 2025

తిరుపతి: కల్తీ నెయ్యి కేసులో మరిన్ని అరెస్టులు..?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 15వ తేదీలోపు మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ తప్పించుకుని తిరుగుతున్న కరీముల్లను సైతం 15వ తేదీలోపు అదుపులోకి తీసుకునే దిశగా సిట్ బృందాలు గాలింపు చేపట్టాయి.

News November 28, 2025

స్మృతితో పెళ్లిపై పలాశ్ తల్లి ఏమన్నారంటే..

image

స్మృతి మంధాన వివాహంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పలాశ్ ముచ్చల్ తల్లి అమృత స్పందించారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆ రోజు జరిగిన పరిణామాలపై ఇద్దరూ బాధపడుతున్నారు. మ్యారేజ్ అవగానే స్మృతికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేశాం. అనుకోని పరిస్థితులతో వివాహం వాయిదా వేశాం’ అని చెప్పారు. కాగా పెళ్లి సంబంధిత పోస్టులను స్మృతి డిలీట్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

News November 28, 2025

కర్నూలు: మంటలు అంటుకొని బాలుడి మృతి…!

image

స్నానానికి వేడి నీరు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పెద్దకడబూరుకు చెందిన వడ్డే ప్రవీణ్ కుమార్(6) మృతి చెందినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న ఘటన జరగగా చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితికి విషమించడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.