News April 4, 2025

సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: NRPT కలెక్టర్ 

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం నర్వ మండల కేంద్రంలోని చౌకధర దుకాణంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని చెప్పారు.

Similar News

News November 17, 2025

శుభ సమయం (17-11-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ త్రయోదశి తె.5.09 వరకు
✒ నక్షత్రం: చిత్త తె.5.20 వరకు
✒ శుభ సమయాలు: సా.7.45-8.10.
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు, మ.2.46-3.34
✒ వర్జ్యం: మ.12.04-1.40
✒ అమృత ఘడియలు: రా.10.49-12.31

News November 17, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 17, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 17, 2025

పెద్దపల్లి: అన్నను కలిసి వెళ్తుండగా అనంతలోకాలకు

image

సెలవురోజు కావడంతో అన్నను కలవడానికి వచ్చిన బాలికను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. SI శ్రావణ్ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్(M) తోంగూర్‌కు చెందిన దాట శివాసిని(8) అన్న దాట శ్రావణ్ సుల్తానాబాద్లోని గురుకులంలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాలకు వచ్చింది. అన్నను కలిసి తిరిగెళ్తుండగా బొలెరో ట్రాలీ ఢీకొనడంతో చనిపోయింది.