News April 5, 2025

సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే కేఆర్

image

పర్వతగిరి మండలం రావూరు గ్రామానికి చెందిన బండి లావణ్య-రమేశ్ ఆహ్వానం మేరకు వారి ఇంట్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం భోజనం చేశారు. సన్న బియ్యం పథకం అమలు కావడంతో ప్రతి పేదవాడు కడుపు మార్చుకోకుండా ఉంటున్నాడని పేర్కొన్నారు. పేదల కోసం తెచ్చిన ఈ పథకం ఘనత సీఎం రేవంత్ రెడ్డికే చెందుతుందని ఆయన చెప్పారు. 

Similar News

News November 24, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓రేపు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం: కలెక్టర్
✓పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు
✓అశ్వరావుపేట: భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
✓దుమ్ముగూడెం: కల్వర్టును ఢీకొని యువకుడు మృతి
✓పోలీస్ వాహనాలు కండిషన్‌లో ఉంచాలి: ఎస్పీ
✓చర్లలో ఐదు రోజులు కరెంట్ కట్
✓కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ వెనక్కి తీసుకోవాలి: కార్మిక సంఘాలు
✓గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ

News November 24, 2025

తిరుపతి: తెలుగు, సంస్కృత అకాడమీ రెండయ్యేనా..?

image

రాయలసీమ ప్రాంతానికి తిరుపతిలో ఏకైక రాష్ట్ర కార్యాలయం తెలుగు, సంస్కృత అకాడమీ మాత్రమే. ఛైర్మన్ ఆర్డీ విల్సన్ తిరుపతి, విజయవాడ రెండు చోట్లా తెలుగు అకాడమీ, తిరుపతిలో సంస్కృత అకాడమీ అభివృద్ధి అంటున్నారు. తెలుగు, సంస్కృతం విడిపోతాయా? వివాదాస్పద నిర్ణయాలు అవసరమా? విద్యా కేంద్రమైన తిరుపతిలో అకాడమీ అభివృద్ధి చేయలేరా అన్న చర్చ ప్రస్తుతం నడుస్తుంది. దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి.

News November 24, 2025

HYD: ACCA సదస్సు.. పాల్గొన్న ఓయూ ప్రతినిధులు

image

అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ACCA) ఈరోజు హోటల్ తాజ్ డెక్కన్లో సదస్సు నిర్వహించారు. ‘కృత్రిమ మేధ–నిరంతర మార్పుల సాంకేతికత ప్రపంచంలో ఫైనాన్స్ ప్రతిభను శక్తివంతం చేయటం’ అంశంపై చర్చించారు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఏకీకరణను పరిష్కరిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.