News February 9, 2025

సన్న బియ్యం సరఫరా చేసే ఆలోచనలో ప్రభుత్వం: అనిత

image

రాష్ట్రంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సన్న రకం వరి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.

Similar News

News November 20, 2025

‘జిల్లాలో 5వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు’

image

బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో ఉద్యాన, వ్యవసాయ శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ పంటపై అవగాహన కార్యక్రమం జరిగింది. మొక్కలు 3వ సంవత్సరం నుంచి 30 ఏళ్లు దిగుబడి ఇస్తాయని, 90% సబ్సిడీపై మొక్కలు, డ్రిప్‌కు 80%- 100% సబ్సిడీ అందిస్తున్నట్లు ఉద్యాన అధికారి అర్చన తెలిపారు. జిల్లాలో 5,000 ఎకరాల్లో తోటలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం అధికారులు తోటలను సందర్శించి రైతులకు సూచనలు చేశారు.

News November 20, 2025

HYD: ఓయూ, SCCL మధ్య ఒప్పందం!

image

ఉస్మానియా విశ్వ విద్యాలయం, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) మధ్య కీలక ఒప్పందం కుదురుచుకుంది. ఎస్సీసీఎల్ సీఎస్ఆర్ కింద ఆర్థిక సంవత్సరం 2025-2026 కోసం స్కాలర్‌షిప్ కార్యక్రమం ఆమోదించబడింది. ఈ ఒప్పంద పత్రాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగరం సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య నరేష్ రెడ్డి సంతకం చేశారు. పరిశోధనా రంగానికి మద్దతుగా ఈ కార్యక్రమానికి రూ.కోటి మంజూరు చేశారు.

News November 20, 2025

HNK: ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

image

హనుమకొండ జిల్లా గ్రంథాలయంలో వారం రోజులుగా నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలు నేటితో ముగిసాయి. ముగింపు వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, నేటి సమాజంలో మానవుడికి టెక్నాలజీ ఎంత ముఖ్యమో, గ్రంథాలయాలు కూడా అంతే ముఖ్యమన్నారు. హనుమకొండ జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు.