News February 9, 2025
సన్న బియ్యం సరఫరా చేసే ఆలోచనలో ప్రభుత్వం: అనిత

రాష్ట్రంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సన్న రకం వరి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.
Similar News
News February 17, 2026
HYD: పెళ్లైంది సరే.. ఆ ‘డబుల్ డ్యూటీ’ సంగతేంటి?

‘ఆఫీసులో ఫైళ్లు.. ఇంట్లో గిన్నెలు.. ఈ నరకం ఎన్నాళ్లు’.. కొత్తగా పెళ్లైన ఐటీ ఉద్యోగినుల ఆవేదన ఇది. సమానత్వం అని మాటల్లో చెబుతున్నా ఇంటి బాధ్యతలు మాత్రం ఇంకా ఆడవారికే అప్పజెప్పుతున్నారు. అత్తమామల నిఘా, ఇంటి పనుల భారం భరించలేక ఆఫీసునే ఒక ‘సేఫ్ జోన్’గా భావిస్తున్నారు. అందుకే ఇంటికి త్వరగా వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పని ఒత్తిడి కంటే ఈ ‘రోల్ ఓవర్‌లోడ్’ యువతను ఇంటికి దూరం చేస్తోంది.
News February 17, 2026
GWL: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కోసం దరఖాస్తులు

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ రెన్యువల్, నూతన పాఠశాలల కోసం మార్చి 25 నుంచి 31 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గద్వాల జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నుషిత మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశం మేరకు జిల్లాలో అర్హత కలిగి, మౌలిక వసతులు గల పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ స్కీంలో ఇప్పటికే కొనసాగుతున్న వారు రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు.
News February 17, 2026
HYD: పెళ్లయింది సరే.. ఆ ‘డబుల్ డ్యూటీ’ సంగతేంటి?