News March 31, 2025
సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 16వ వార్డులోని రేషన్ షాపులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఆర్డీవో రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
Similar News
News November 7, 2025
కరీంనగర్ కలెక్టరేట్లో ‘వందేమాతరం’ గీతాలాపన

స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం ఉద్యోగులు సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
News November 7, 2025
బిహార్లో మరోసారి ఎన్డీయేదే విజయం: మోదీ

బిహార్లో నిన్న జరిగిన భారీ పోలింగ్ మరోసారి NDA ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే సంకేతాలను ఇస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీలో ఆయన ఈ కామెంట్లు చేశారు. జేడీయూ అబద్ధాల ప్యాకేజీని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని అన్నారు. ‘జంగిల్ రాజ్’ను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ రానివ్వద్దనే దృఢ సంకల్పంతో ఉన్నారని స్పష్టం చేశారు. నిన్న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 64.66% పోలింగ్ నమోదైంది.
News November 7, 2025
వరంగల్: సైబర్ నేరాలపై అవగాహనే మీకు రక్ష..!

సైబర్ నేరాలపై అవగాహనే మీకు రక్ష అని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఇంట్లోని చిన్నారులు, విద్యార్థులకు పెద్దలు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ మీ కుటుంబాన్ని సైబర్ నేరాల భారీ నుంచి కాపాడుకోవాలని, అవగాహనతోనే నేరాల కట్టడి సాధ్యమని పోలీసులు పేర్కొన్నారు. ప్రజలు సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. SHARE IT


