News February 4, 2025

సబ్బవరం: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

image

సబ్బవరం శివారు పెదనాయుడుపాలెంలో పూర్ణశేఖర్(22) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడు ఆదివారం రాత్రి ఇంటిలో భోజనం చేసి బయటకు వెళ్లాడు. సోమవారం తల్లిదండ్రులు నారపాడు గోవింద,నాయుడమ్మ కల్లం వద్దకు వెళ్లి చూడగా పశువుల షెడ్డు వద్ద వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. తల్లి నాయుడమ్మ ఫిర్యాదు మేరకు పరవాడ డి.ఎస్.పి విష్ణు స్వరూప్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.

Similar News

News February 8, 2026

జీడిమామిడిలో ఆకు, పూత, కాయమచ్చ తెగులు నివారణ

image

ఈ తెగులు వల్ల జీడిమామిడి చెట్టు ఆకులపై చిన్న, చిన్న లేత ఆకుపచ్చ మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి పెరుగుతూ మచ్చ మధ్య ఎండిపోతుంది. చివరికి మొత్తం ఆకు ఎండి రాలిపోతుంది. పూత కాడలపై మచ్చలు వచ్చి పూత ఎండిపోయి రాలిపోతుంది. ఈ తెగులు నివారణకు రైతులు తొలుత తెగులు ఆశించిన కొమ్మలను తొలగించాలి. లీటరు నీటికి మ్యాంకోజెబ్ 1 గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 1ml కలిపి పిచికారీ చేసుకోవాలి.

News February 8, 2026

పాలమూరు: మాజీ కౌన్సిలర్ కిడ్నాప్‌నకు యత్నం

image

గద్వాల పట్టణంలో పట్టపగలే మాజీ కౌన్సిలర్ మహేశ్వరిని కిడ్నాప్ చేసేందుకు ఓ ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. షాపింగ్ ముగించుకుని బంధువులతో కలిసి ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ ఆటోను దారి మళ్లించి వేగంగా తీసుకెళ్లాడు. అప్రమత్తమైన బాధితురాలు కేకలు వేస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆటోను వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి భర్త సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News February 8, 2026

అనకాపల్లి: ‘దివ్యాంగ విద్యార్థులను ప్రోత్సహించాలి’

image

దివ్యాంగ విద్యార్థులకు తగిన ప్రోత్సహం అందిస్తే మంచి ప్రతిభను ప్రదర్శిస్తారని డీఈవో అప్పారావు నాయుడు అన్నారు. అనకాపల్లి పట్టణం గుండాల జంక్షన్ వద్ద జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ బాలబాలికలకు నిర్వహించిన జిల్లా స్థాయి కల్చరల్, ఆర్ట్ పోటీలను ఆయన ప్రారంభించారు. దివ్యాంగ విద్యార్థుల్లో ప్రతిభ, సామర్ధ్యాలను వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయన్నారు.