News January 28, 2025
సబ్బవరం: బాలిక కిడ్నాప్ కేసులో మరొకరు అరెస్ట్

సబ్బవరం మండలంలోని ఓ గ్రామంలో బాలికను కిడ్నాప్ చేసిన కేసులో మరో నిందితుడు ఎం.సాయి కుమార్‌ను సోమవారం అరెస్టు చేసినట్లు పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ తెలిపారు. గతేడాది అక్టోబర్ 19న విజయనగరం జిల్లాకు చెందిన పి.మహేశ్ బాలికను కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఈనెల 10న మహేశ్‌ను అరెస్టు చేయగా అతనికి సహకరించిన సాయికుమార్‌ను అరెస్టు చేసి 23 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News December 1, 2025
రంప ఏజెన్సీలో హై అలర్ట్!

డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టులు PLGA వారోత్సవాలకు పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాలలో ఎన్‌కౌంటర్లలో మృతిచెందిన మావోయిస్టులకు ఆ పార్టీ శ్రేణులు నివాళులు అర్పిస్తారు. ఏటా ఈవారోత్సవాలు జరగడం, పోలీసులు అప్రమత్తంగా ఉండడం సాధారణమే అయినప్పటికీ, ఇటీవల జరిగిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ల నేపథ్యంలో ఈసారి రంప ఏజెన్సీలో మరింత హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
News December 1, 2025
జగిత్యాల: ‘ఈ సంవత్సరం 83 కేసులు నమోదు’

ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్ నుంచి మెడికల్ కాలేజీ వరకు నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ ప్రారంభించారు. ఎయిడ్స్‌కు నివారణే మేలని, యువత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో 2,573 మంది ఏఆర్‌టి చికిత్స పొందుతున్నారని వైద్య అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం 83 కేసులు నమోదయ్యాయని చెప్పారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.
News December 1, 2025
మెదక్: శిక్షణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్

మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రశాంత్ శిక్షణలో ప్రతిభ చూపడంతో ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించారు. మొయినాబాద్ ఐఐటీఏ శిక్షణకు వివిధ జిల్లా నుంచి 51 మంది హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రదీప్, ప్రశాంత్, రాకేష్ హాజరయ్యారు. ఫైరింగ్, పీపీటీ విభాగాల శిక్షణలో ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ చూపి మెడల్ పొందాడు. ప్రశాంత్‌ను ఎస్పీ అభినందించారు.


