News September 30, 2024
సబ్ కలెక్టర్ రేట్ ఫైళ్ల దగ్ధం కేసులో రికార్డులు తీసుకెళ్లిన సిఐడి
మదనపల్లె సబ్ కలెక్టర్ రేట్ లో ఫైళ్ల దగ్ధం అనంతరం సీజ్ చేసిన రికార్థులను ఆదివారం ప్రత్యేకవాహనంలో తిరుపతి సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు. శనివారం మదనపల్లెకు వచ్చిన సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ రెండు రోజులపాటు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో కేసులోని కొందరిని విచారించారు. అనంతరం అప్పట్లో కేసుకు సంబంధించి సీజ్ చేసిన రికార్డులు అన్నింటినీ స్వాధీనంచేసుకుని తీసుకెళ్లడంతో ఫైల్ దగ్ధం కేసు మరుగున పడిందనట్లయింది.
Similar News
News October 5, 2024
సీఎం చంద్రబాబుకు వీడ్కోలు
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగించుకొని శనివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగుపయనమయ్యారు. ఆయనకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య తదితరులు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
News October 5, 2024
వకుళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన చంద్రబాబు
తిరుమల పాంచజన్యం వెనుక నూతనంగా నిర్మించిన వకుళామాత కేంద్రీయ వంటశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు రూ.13.45 కోట్లతో ఈ భవనం నిర్మించారు. 1.20 లక్షల మంది భక్తులకు సరిపడే విధంగా భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు.
News October 5, 2024
సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం వకుళమాత నూతన కేంద్రీకృత వంటశాలను ప్రారంభించి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే టీటీడీ అధికారులతో సమావేశం అయి తర్వాత తిరుగు ప్రయాణం కానున్నారు. లడ్డూ వ్యవహారం అనంతరం సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.