News June 30, 2024
సబ్ స్టేషన్లలో అందుబాటులో ఉండాలి: SE

నెల్లూరు సర్కిల్ పరిధిలో వినియోగదారులకు మరింత మెరుగ్గా కరెంట్ సరఫరా అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని APSPDCL ఎస్ఈ విజయన్ వెల్లడించారు. ఇందులో భాగంగానే ‘పీక్ హవర్స్లో సబ్ స్టేషన్ల తనిఖీ’ అనే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఆయా సబ్ స్టేషన్లలో అధికారులు అందుబాటులో ఉండి కరెంట్ సరఫరాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News December 7, 2025
నెల్లూరు జిల్లాలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

ఎస్పీ అజిత ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు 50 ప్రత్యేక బృందాలతో నాకా బంది నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగంగా రాత్రి పూట వాహనాల తనిఖీని తీవ్రతరం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్పై 13 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ 11 కేసులు, ఓవర్ స్పీట్/రాష్ డ్రైవింగ్-8 కేసులు, 3-వాహనాలు సీజ్ చేసి, MV యాక్ట్ కేసులు నమోదు చేసి రూ.1,81,260 జరిమానా విధించారు.
News December 7, 2025
నెల్లూరులో బస్సు డ్రైవర్పై కత్తితో దాడి

నెల్లూరులో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. బోసుబొమ్మ సెంటర్ వద్ద బస్సు డ్రైవర్, కండక్టర్పై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 7, 2025
నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనును సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్ను సంప్రదించాలన్నారు.


