News March 22, 2025
సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిని గుర్తించండి: షబ్బీర్ అలీ

మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులను వేగవంతం చేసి మున్సిపల్ ఏరియాలో రోజుకు రెండుసార్లు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. పట్టణంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిని గుర్తించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రంజాన్ పండుగ సందర్భంగా నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News October 14, 2025
విజయనగరం: విధుల్లోకి చేరిన నూతన ఉపాధ్యాయులు

డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు విధుల్లో చేరడంతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి. ఈ నియామకాలతో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీతో జిల్లాలోని 34 మండలాల్లో అన్ని మేనేజ్మెంట్లో 578 మంది కొత్త ఉపాధ్యాయలు పోస్టింగ్ పొందారని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. వీరంతా సోమవారం విధులకు హాజరయ్యారు.
News October 14, 2025
ములుగు డీసీసీపై ‘రెడ్డి’ కన్ను..?!

ములుగు డీసీసీ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లాడి రాంరెడ్డి ప్రయత్నం తీవ్రతరం చేశారు. మార్కెట్ కమిటీ, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ పదవులు ఎస్టీలకు కేటాయించడంతో మిగతా సామాజిక వర్గాల నేతలు తమ భవిష్యత్‌పై ఆందోళనలో ఉన్నారు. డీసీసీ ప్రెసిడెంట్‌గా పైడాకుల అశోక్ రెండు పర్యాయలు పనిచేయగా.. ఈసారి మల్లాడికే అవకాశం వస్తుందనే ప్రచారం జరుగుతోంది.
News October 14, 2025
హనుమకొండ: కార్పొరేటర్ ఇంట్లో పేకాట.. 12 మంది అరెస్ట్

హనుమకొండ సుబేదారి కనకదుర్గ కాలనీలోని ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ నేతృత్వంలో పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలతో సహా 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 వేల నగదు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.