News April 29, 2024

సభాస్థలిని పరిశీలించిన ఎంపీ బీబీ పాటిల్

image

అల్లాదుర్గంలో రేపు మధ్యాహ్నం నిర్వహించ తలపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ స్థలిని సోమవారం మధ్యాహ్నం బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ మేరకు సంబంధిత సభా వేదిక ఏర్పాట్ల నిర్వాహకులతో చర్చించారు. ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని బీబీ పాటిల్ సూచించారు.

Similar News

News October 14, 2025

మెదక్: NMMS దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్‌ (NMMS) పరీక్ష దరఖాస్తుల గడువు ఈ మంగళవారంతో ముగియనుందని ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనుందని తెలిపారు. పూర్తి వివరాలకు bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News October 14, 2025

చేగుంట: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు స్వాతి

image

చేగుంట మండల పరిధిలోని చందాయపెట్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కే. స్వాతి రాష్ట్ర స్థాయి కబడ్డీ అండర్ 14 పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ శంకర్ చారి తెలిపారు. స్వాతి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయుడు శ్రీ కిషన్, ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాఠశాల, విద్యార్థులు ఆమెను సత్కరించారు.

News October 14, 2025

MDK: అమరవీరులను స్మరించుకుంటూ వ్యాసరచన పోటీలు: ఎస్పీ

image

మెదక్ జిల్లాలోని పోలీస్ ఫ్లాగ్ డే (అక్టోబర్ 21) సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకునే ఉద్దేశంతో ఈ ఆన్‌లైన్ పోటీలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మూడు భాషల్లో నిర్వహిస్తారు. 6వ తరగతి నుంచి ఆసక్తి ఉన్న విద్యార్థులు పాల్గొనాలని ఎస్పీ సూచించారు.