News April 29, 2024
సభాస్థలిని పరిశీలించిన ఎంపీ బీబీ పాటిల్

అల్లాదుర్గంలో రేపు మధ్యాహ్నం నిర్వహించ తలపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ స్థలిని సోమవారం మధ్యాహ్నం బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ మేరకు సంబంధిత సభా వేదిక ఏర్పాట్ల నిర్వాహకులతో చర్చించారు. ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని బీబీ పాటిల్ సూచించారు.
Similar News
News April 16, 2026
మెదక్: ఫీజు రాయితీలకు సర్టిఫికెట్లు కీలకం: కలెక్టర్

పదో తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రాయితీలలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 241 మంది విద్యార్థులకు క్యాస్ట్, ఇన్‌కమ్, బర్త్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

News April 14, 2026
మెదక్: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ విడుదల

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ వారోత్సవాల లక్ష్యమన్నారు. ఇళ్లు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి జి.వేణు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.