News February 1, 2025
సభ్యత్వ నమోదుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలి: బాపట్ల జేసీ

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ సభ్యత్వ నమోదు గురించి జిల్లా స్థాయి కమిటీ మీటింగ్ శనివారం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈ శ్రమ్ పోర్టల్లో సభ్యత్వ నమోదుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News November 10, 2025
10న యథావిధిగా ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’: కలెక్టర్

అమలాపురం కలెక్టరేట్లో ఈనెల 10 సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి, ఆర్డీవో, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.
News November 10, 2025
గుంటూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచన

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్తో పాటు మండల ప్రధాన కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inలో కూడా సమర్పించవచ్చని, అదేవిధంగా 1100 నంబర్కి డయల్ చేసి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు పీజీఆర్ఎస్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 10, 2025
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ నరసింహ

ఈ నెల 15న జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. రాజీ మార్గమే రాజమార్గం అని ఆయన పేర్కొన్నారు. రాజీపడదగిన కేసుల్లో ఇరువర్గాలు పరస్పర అవగాహనతో పరిష్కారం కనుగొంటే, సమయం, ధనం, శ్రమ ఆదా అవుతాయని తెలిపారు. పోలీసులు రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారని ఎస్పీ తెలిపారు.


