News September 30, 2024
సమగ్ర కుల జనగణన చేయాలి: తీన్మార్ మల్లన్న

సమగ్ర కుల జనగణన చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం సమగ్రకుల జన గణన సాధనకై బేగంపేట టూరిస్ట్ ప్లాజాలో ఉద్యోగులు, మేధావులు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేయకపోతే, 42 శాతం రిజర్వేషన్లకు బీసీలకు ఇవ్వకపోతే తీన్మార్ మల్లన్నదే బాధ్యత అని అన్నారు.
Similar News
News December 13, 2025
గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరపాలి: కలెక్టర్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆమె మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కౌంటింగ్ సమయానికి ప్రారంభించి, ఎటువంటి జాప్యం లేకుండా ఫలితాలను వెల్లడించాలని అధికారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
News December 13, 2025
22 ఏళ్లకే ఉపసర్పంచ్‌గా ఎన్నిక.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ప్రజాసేవకు!

శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామ యువతి బండారి రిషిత (22) అరుదైన ఘనత సాధించారు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించిన ఆమె, గ్రామాభివృద్ధి ధ్యేయంగా కొలువును వదిలారు. ఈమె మంచి మనసును గుర్తించిన గ్రామస్తులు రిషితను తొలి విడత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. యువతకు రిషిత ఆదర్శంగా నిలిచారు.
News December 12, 2025
NLG: స్టేజ్- 2 ఆర్ఓ సస్పెండ్: కలెక్టర్

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో పోలైన బ్యాలెట్ పత్రాలు బయటికి వచ్చిన ఘటనలో స్టేజ్- 2 ఆర్‌వోను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పోలైన బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకువచ్చిన పేరు తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.


