News August 10, 2024

సమత ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు

image

విశాఖ నుంచి వయా విజయనగరం మీదుగా వెళ్లే విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించారు. రెగ్యులర్‌గా ఈ రైలు విజయనగరం, పార్వతీపురం, రాయగడ, రాయపూర్ మీదుగా నిజాముద్దీన్ వెళ్తుంది. అనివార్య కారణాల వల్ల 12807 నంబర్‌తో నడిచే ఈ రైలు శనివారం విజయవాడ మీదుగా నిజాముద్దీన్ వెళ్లనుంది. శనివారం ఉదయం 9.20 నిమిషాలకు ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని అధికారులు కోరారు.

Similar News

News January 11, 2026

ఆనందపురంలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే

image

ఆనందపురం మండలంలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కేజీ రూ.950-1000 ఉండగా.. చికెన్ (స్కిన్ లెస్) కేజీ రూ.300గా ఉంది. విత్ స్కిన్ కేజీ రూ.280 చొప్పున విక్రయిస్తున్నారు. శొంఠ్యాం కోడి కేజీ రూ.310గా ఉంది. అలాగే డజన్ గుడ్లు రూ.90కి కొనుగోలు చేస్తున్నారు. గత వారంతో పోల్చుకుంటే దాదాపు అన్ని రేట్లు కాస్త పెరిగాయని వినియోగదారులు తెలిపారు.

News January 10, 2026

బాలల రక్షణే లక్ష్యం: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి, వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై శనివారం సమన్వయ సమావేశం జరిగింది. బాలలపై నేరాలను అరికట్టేందుకు ప్రోయాక్టివ్ పోలీసింగ్, ఫోరెన్సిక్ ఆధారాలతో వేగవంతమైన దర్యాప్తు, కోర్టు ప్రక్రియల్లో జాప్యం నివారణపై చర్చించారు. పోలీస్, న్యాయవ్యవస్థ, పౌర సమాజం కలిసి పనిచేసినప్పుడే బాలలకు భద్రత లభిస్తుందని, నేరస్థులకు కఠిన శిక్షలు పడతాయని సీపీ స్పష్టం చేశారు.

News January 10, 2026

విశాఖ: ‘డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.1.60 కోట్లు దోచేశాడు’

image

సైబర్ నేరగాళ్ల వలలో ఉద్యోగస్తులు సైతం చిక్కుకుంటున్నారు. రుషికొండ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ పేరిట భయపెట్టి రూ.1.60 కోట్ల వరకు దోచేశారు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి కరీంనగర్ (D) రామగుండంకు చెందిన రాపల్లి అభినవ్‌ను పట్టుకున్నారు. నిందితుడు సైబర్ క్రైమ్ ముఠాకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు.