News August 10, 2024
సమత ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు

విశాఖ నుంచి వయా విజయనగరం మీదుగా వెళ్లే విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించారు. రెగ్యులర్‌గా ఈ రైలు విజయనగరం, పార్వతీపురం, రాయగడ, రాయపూర్ మీదుగా నిజాముద్దీన్ వెళ్తుంది. అనివార్య కారణాల వల్ల 12807 నంబర్‌తో నడిచే ఈ రైలు శనివారం విజయవాడ మీదుగా నిజాముద్దీన్ వెళ్లనుంది. శనివారం ఉదయం 9.20 నిమిషాలకు ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని అధికారులు కోరారు.
Similar News
News April 17, 2026
జీజీహెచ్‌లో అత్యవసర పనులు వేగవంతం చేయాలి: VZM కలెక్టర్

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యవసర అభివృద్ధి పనులకు వెంటనే ఆమోదం పొంది పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు అవసరమైన పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. విద్యుత్ వైరింగ్‌ను సక్రమంగా నిర్వహించి షార్ట్ సర్క్యూట్ నివారించాలని, నీటి పైప్‌లైన్ లీకేజీలను అరికట్టాలన్నారు.

VZM: ‘మంజూరైన పరిశ్రమలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలి’

రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహ బోర్డు ద్వారా జిల్లాకు మంజూరైన పరిశ్రమలను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తన చాంబర్‌లో రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికారులతో విజయనగరం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాకు 4 పరిశ్రమలు మంజూరయ్యాయని, వీటికి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా వచ్చాయన్నారు. ఆటంకాలు లేకుండా పనులను ప్రారంభించాలన్నారు.